10 June, 2026 | 4:13 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

వానాకాలం ఆరంభంలో నాగబంధం

28-03-2026 02:09 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తె రకెక్కుతున్న మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగ బంధం’. నిక్ స్టూడియో స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషి త నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేశ్, ఈశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మంజ్రే కర్, జయప్రకాశ్, మురళీశర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా మరో అప్‌డేట్ పంచుకుందీ చిత్రబృందం. ఈ సినిమాను వర్షాకాలం ప్రారంభంలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటిస్తూ, విడుదల తేదీ జూలై 3గా ఖరారు చేశారు. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో కథానాయకుడు రెండు రకాల గెటప్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.  ఈ చిత్రానికి డీవోపీ: సౌందర్ రాజన్ ఎస్; సంగీతం: జునైద్ కుమార్, అభే; నేపథ్య సంగీతం: జునైద్ కుమార్; సంభాషణలు: కళ్యాణ్ చక్రవర్తి; సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని; ప్రొడక్షన్ డిజైన్: అశోక్‌కుమార్; ఎడిటర్: ఆర్సి ప్రణవ్.