నేడు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్
28-03-2026 02:11 AM
సంగీత మాంత్రికుడు ఇళయరాజా 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. జోరా వరల్డ్ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుకలో ఇళయరాజా తన మధురమైన గీతాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను ఇళయరాజా స్వయంగా వెల్లడించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్వాహకులు సంజయ్‌కుమార్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, మోహిత్ పాల్గొన్నారు.




