10 May, 2026 | 4:32 AM

గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు

10-05-2026 12:00 AM

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలు మంచి విజ యం సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి మూడో భాగం ‘దృశ్యం 3’ వస్తోంది. ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తోపాటు మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 21న మలయాళంతోపాటు పలు ఇతర భాషల్లో విడుదల కానుందీ చిత్రం.

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో సాగుతోందీ ట్రైలర్. మోహన్ లాల్, మీనా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) మళ్లీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంచుకున్న కొత్త మార్గాలు, పాత కేసు నుంచి ఎదురయ్యే సవాళ్లను ఈ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ‘గతం ఎప్పుడూ మౌ నంగా ఉండదు’, ‘ఒక సాధారణ కుటుంబం మీదకు వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి ఎంతవరకైనా వెళ్తాను’ వంటి డైలాగ్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.