10 May, 2026 | 3:21 AM

బలమైన భావోద్వేగాల దేత్తడి

10-05-2026 12:00 AM

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ హీరో ఆశిష్ నటిస్తున్న తాజాచిత్రం ‘దేత్తడి’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా ఆదిత్యరావు గంగసాని వెండితెరకు పరిచయమవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటి టికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌నకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

కథానాయకుడు ఆశిష్‌తోపాటు కీలక తారాగ ణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నా రు. ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతోపాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది. ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకు జునైద్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.