10 June, 2026 | 4:12 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

06-04-2026 03:44 AM
  1. బీజేపీ నేతలు, కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

తన నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరణ 

ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందురోజే వేడుక

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముందురోజు ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ యన మాట్లాడుతూ.. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి బూత్, ప్రతి ప్రాంతంలో బీజేపీ జెండాను ఎగరవేసి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అంతకు ముందు ఆయన మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులార్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాం తం పోరాడిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు.