24 March, 2026 | 7:15 AM

సహజ ప్రసవాల సంఖ్య పెంచాలి

24-03-2026 12:58 AM

గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలి 

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

గజ్వేల్ మాతా శిశు ఆసుపత్రి, వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి

గజ్వేల్, మార్చి 23: మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెం చుతూ గర్భవతులకు మెరుగైన సేవలు అం దించాలని గజ్వేల్ మాతా శిశు ఆసుపత్రి అ ధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ హై మావతి ఆదేశించారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయి లో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద గర్భిణీ స్త్రీలకు మంచి వైద్యం కోసం ఆసుపత్రి భవనంతో పాటు అన్ని సదుపాయాలను కల్పిం చిందని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనీ డా క్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది ప్రతి ఒక్కరు గర్భిణీలకు ఓపికగా వైద్యం చెయ్యాలని ఆదేశించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు టీకాలను సక్రమంగా అందించాలన్నారు. గర్భిణీ స్త్రీల లో మనో ధైర్యం నింపుతూ మంచి ఆహారపు నియమాలు, సహజ ప్రసవాలు జరిగేలా యోగ లాంటి కొన్ని యాక్టివిటీస్ చెప్పాలని డాక్టర్లకు సూచించారు.

సహజ ప్రసవాలు పెంచాలని తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఆసుపత్రిలో కొంత మంది డాక్టర్లు ఇతర సిబ్బంది నిర్ల క్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ డాక్టర్ నుండి కింది స్థాయి సి బ్బంది వరకు పై అధికారి అనుమతి లేనిదే సె లవు తీసుకోవద్దని తప్పనిసరిగా ఆసుపత్రిలో లీవ్ లెటర్ పెట్టాలని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

వర్గల్ మండలంలోని మహాత్మా జ్యోతి బాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యా హ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కిచెన్ గార్డెన్ లో పెంచిన కూరగా య, పూల చెట్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్టా నీరు బాగా పెట్టాలని గురుకుల వాతావరణం చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు.

ఆహార పదార్థాలు పరిశీలించి, కామన్ డైట్ మెనూ పాటిస్తూ రోజు విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు పంపిణీ చేసి రుచికరంగా, అందరికీ సరిపోయేలా వండాలని తెలిపారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసి భోజనం చేశారు.  భోజనం, వసతుల విషయం లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీశారు. మెనూ ప్రకారం అందిస్తున్నట్లు కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నట్లు విద్యార్థులు కలెక్టర్ కి తెలిపారు. కూరల నాణ్యత పెంచి రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.