12 April, 2026 | 2:04 AM

కూలిపోయే దుస్థితి కొత్త రోడ్డు

12-04-2026 12:00 AM
  1. అధికారులు, స్థానిక నాయకుల నిర్లక్ష్యం బహిర్గతం

ప్రారంభంలోనే పగుళ్లు

నాసిరకం పనులపై అనుమానాలు

వెంటనే స్పందించకపోతే పెద్ద ప్రమాదం తప్పదని హెచ్చరిక

కుషాయిగూడ ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : కాప్రా ఎమ్మార్వో కార్యాలయం నుండి ఎల్లారెడ్డి గూడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు ప్రా రంభంలోనే బీటలు వారడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే రోడ్డు మధ్యలో పెద్ద పగుళ్లు ఏర్పడి కాంక్రీట్ పలకలు పైకి లేచిన దృశ్యా లు నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ రహదారి మీద రోజూ భారీ వాహనాలు, ట్రక్కులు నిరంతరం ప్రయాణిస్తున్నాయి. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న రోడ్డు ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం కనీసం పరిశీలనకైనా రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పనులు పూర్తయ్యాక కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని స్థానికులు ప్రశ్ని స్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పం దించి రహదారిని మరమ్మతు చేయడంతో పాటు భారీ వాహనాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని, ట్రాఫిక్ను ఇతర మార్గాలకు మళ్లించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.