12 April, 2026 | 2:06 AM

ఈ వారం వార్తల్లో..

12-04-2026 12:00 AM

నితీశ్ రామాయణం

‘దంగల్’, ‘చిచ్చోరే’ వంటి చిత్రాలతో సినీ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన దర్శక దిగ్గజం నితీశ్ తివారీ. ‘దంగల్’ చిత్రం కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లు రాబట్టిన చిత్రం. అలాంటి మేటి దర్శకుడి తాజా ప్రాజెక్ట్ ‘రామాయణ’. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

‘సీతయ్య’ నెతన్యాహు

‘ఎవడూ మాట వినడు సీతయ్య!’ అనే నానుడి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఈ నానుడి ఇప్పుడు అచ్చంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకు సరిపోతుంది. ఎందుకంటే, పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇరాన్ నాలుగు అడుగులు వెనక్కి వేసి శాంతి చర్చలకు పూనుకోగా, అమెరికా మద్దతుదారైన నెతన్యాహు మాత్రం ససేమిరా అంటున్నారు.