14 July, 2026 | 11:22 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ములుగు పోలీసుల వైఖరి మార్చుకోవాలి

18-04-2026 12:50 AM

సుర్వి రాజు గౌడ్

సంస్థాన్ నారాయణపూర్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎండీసీ అధికారికంగా లోడింగ్ నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోడైన ఇసుక హైదరాబాద్‌కు వచ్చే తరుణంలో ములుగు జిల్లాకు రానీయకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఆరోపించారు. రాజు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం టీజీఎండీసీ డైరెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోడ్ అయిన మా ఇసుక లారీలను ఖమ్మం నుంచి వెళ్లాలని చెప్పడం వలన మేము హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో డీజిల్ ఖర్చులతో పాటు ఐదువేల రూపాయల వరకు నష్టపోతున్నామని అన్నారు.ములుగు జిల్లా పోలీసులపై మంత్రి సీతక్క చర్యలు తీసుకొని లారీ డ్రైవర్లను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లగ్గోని అంజయ్య గౌడ్, లగ్గోని శ్రీనివాస్ గౌడ్,కానుగు దాసు, గోధుమగడ్డ జంగారెడ్డి,అంతటి సురేష్ గౌడ్,వంటల గణేష్ యాదవ్,గుండు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.