11 March, 2026 | 12:58 PM

ఎంఆర్‌ఓ కార్యాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలి

11-03-2026 12:00 AM

కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవంలో  జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే విజయ రమణారావు

కాల్వ శ్రీరాం పూర్, మార్చి 10(విజయ క్రాంతి) నూతనంగా ప్రారంభించిన మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ద్వారా మండల ప్రజలకు మెరుగైన సేవలు వేగవంతంగా అందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  తెలిపారు.మంగళవారం జి ల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 75 లక్షల రూపాయల గ్రాంట్ నిధులతో నూతనంగా నిర్మించిన మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తో పాటు అదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎంఆర్ ఓ కార్యాలయ నిర్మాణం చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని, రూ. 75 లక్షల రూపాయలతో అన్ని వసతులతో కూడిన నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు తెలి పారు. నూతన కార్యాలయం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, వారి స మస్యలు సత్వరపు పరిష్కారం అయ్యే దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ గా విభజించి ప్రతి క్లస్టర్ కు గ్రామ పరిపాలన అధికారి నియమించామని తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత డిస్పోజ్ చేయా ల్సి ఉంటుందని , ప్రతి దరఖాస్తు వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవలు అం దించే రెవెన్యూ శాఖకు మండలంలో మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల పెం పు ,నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్,

రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చే స్తున్నట్లు తెలిపారు. పేద రైతులకు ఉన్న భూ హక్కుల సంరక్షణ కోసం భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్  జగదీశ్వర్ రావు, ఎంపిడిఓ రామ్మోహన్ చారి,ప్రజాప్రతినిధులు, సం బంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.