11 March, 2026 | 2:47 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

అందే గ్రామంలో 7700 కోళ్లు మృతి

11-03-2026 12:00 AM
  1. బర్డ్ ఫ్లూ సోకిందేమోనని అనుమానం?
  2. ఆందోళనలో మిరుదొడ్డి మండలవాసులు

సిద్దిపేట, మార్చి 10 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో 7700 కోళ్లు ఒకేసారి మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపించింది అంటూ పుకార్లు కలకలం రేపుతు న్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందేమోనని ప్రజల్లో అనుమానం రేకెత్తింది. గ్రామానికి చెందిన రంగనమైన కుమార్‌కు చెందిన పౌల్ట్రీ ఫాంలో సుమారు 7,700 కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి.

కోళ్ల మృతితో రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకుం టూ రైతులకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అధికారులు పూర్తి స్థాయి నివేది క కోసం ఎదురు చూస్తున్నారు.