11 March, 2026 | 1:54 PM

Breaking News

బీసీ హాస్టల్ బాలికల విద్యార్థులకు తప్పని నీటి కష్టాలు !

11-03-2026 10:17 AM

బిందెలు,బకెట్ల సాయంతో నీళ్లు మోసుకెళ్తున్న విద్యార్థులు 

అలంపూర్: ఈ శనివారం నుండి పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు మొదలు...ఏ ఆటంకం లేకుండా  పుస్తకాలు చేతబట్టి  సిలబస్ ను పూర్తి చేసుకోవలసిన  విద్యార్థులు... ఇలా బిందెలు, బకెట్లు చేత పట్టుకుని నీళ్ళ కోసం వీధుల వెంబడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది .ఇలా అయితే విద్యార్థుల చదువు సాఫీగా సాగేదెలా ?వారు ఉత్తమ ఫలితాలు సాధించేది ఎలా? అని ఈ దృశ్యాన్ని చూసిన అని చూసిన ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. అయితే గత రెండు రోజులుగా హాస్టల్లో ఉన్న  బోరు చెడిపోయి నీళ్లు రాకపోగా బుధవారం ఉదయం విద్యార్థులు హాస్టల్ సమీప కాలనీలో  ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి  కుళాయిల వద్ద బిందెలు,బకెట్ల సాయంతో ఇలా నీటిని తీసుకెళ్లారు.మండలం కేంద్రంలో విద్యార్థులకు ఇలాంటి దుస్థితి ఏర్పడడం దౌర్భాగ్యమని  ప్రజలు చర్చించుకున్నారు.

దీనిపైన సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు విద్యార్థులు ఎదుర్కొన్నప్పుడు వారి చదువులపై ఆటంకం కలిగి ఒత్తిడికి గురై ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో గమనించవలసిన విషయమని పలువురు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరారు.