30 August, 2026 | 1:24 AM

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న మోదీ సర్కార్

30-08-2026 12:00 AM

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ళ ఆగష్టు 29 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంపీ నిధులు రూ.10 లక్షల తో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ము న్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి, స్థానిక కౌన్సిలర్ అత్తేళ్లి మనీషా అనంతరెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాష్ తో కలిసి చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం మున్సిపల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కేంద్ర సర్కార్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డు  హౌసింగ్ బోర్డు ప్రజల కొంత మేర ఊరట లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.