మారని అన్నదాత తలరాత!
- దుక్కి దున్నే నాటి నుండి ధాన్యం అమ్మెవరకు తప్పని తిప్పలు
- పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న రైతన్నలు
- పంట చేతికి రావడం ఒకెత్తయితే అమ్మడం మరో సవాల్
- కష్టాలు తీరేదెన్నడో అంటూ దిగాలు
సంస్థాన్ నారాయణపూర్, మే 26: రైతన్న... ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాం తం కష్టాలతో సహవాసం.. కన్నీళ్లతో సంసారం.. పంట పండించే నాటి నుండి అడుగడుగునా సమస్యలతో సతమవుతమవుతూ అన్నింటిని అధిగమించి పంట చేతికొస్తే దానిని అమ్ముకోవడానికి యుద్ధమే చేయాల్సి వస్తుంది.
పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల అసమర్ధతకు నిలువునా మునిగిపోతున్నాడు అన్నదాత. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుం ది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వ మంత్రుల హామీలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ సాధ్యం కావ డం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది.
కల్లాల్లో ధాన్యం.. రైతు కళ్ళల్లో దైన్యం...
సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలో రెండు ప్రాథమిక సహకార సం ఘాలు ఉండగా ధాన్యం కోలుగోలుకై 10 కొనుగోలు కేంద్రాలను వివిధ గ్రామాలలో ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ఏ కొనుగోలు కేంద్రం చూసిన ధాన్యం రాశులు నిండిపోయి ఉన్నాయి. అధికారులు వడ్లను కొనకపోవడంతో రోజు లారీలలో ధాన్యం లోడ్ కాకపోవడంతో రాశులు కుప్పలు గుట్టలుగా పేరుకుపోయాయి. నారాయణపురం, గుడిమల్కాపురం తదితర గ్రామాల్లో వడ్ల రాశులు కొనుగోలు కేంద్రాల నిండా నిండిపోయాయి. దీంతో వడ్లు తీసుకువచ్చే రై తులకు రాశులుగా పోసుకోవడానికి కూడా చోటు దొరకడం లేదు.
వాతావరణంలో మార్పులు:
గత రెండు రోజులుగా వాతావరణం మారిపోయి మోస్తరు జల్లులు కురుస్తున్నా యి. దీంతో అన్నదాతల గుండెల్లో అలజడి మొదలైంది.అధికారుల నిర్లక్ష్యంతో ఆరుగా లం కష్టపడిందంతా వర్షానికి తడుస్తుందేమోనన్న భయంతో ఆందోళనకు లోనవుతున్నారు. గత ఇరవై రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి గుడిమల్కాపూర్ కొనుగో లు కేంద్రంలో దాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన రాశుల కిందకు నీరు చేరి రంగు మారి నల్లగా తయారై మొలకలు వ చ్చాయి. అన్ని సరిగా ఉంటేనే రెండో గ్రేడ్ కింద జమ చేసే అధికారుల తీరుతో తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలంటూ రైతు లు ఆవేదన చెందుతున్నారు.
హమాలీ కార్మికుల ఇబ్బందులు
లోడింగ్ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన గన్ని బ్యాగులలో సగానికి సగం పనికిరాని చిల్లులు పడిన బస్తాలు ఉండడంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా రోజుకు ఒక లారీ లోడ్ అవ్వడంతో తమకు వచ్చే డబ్బులు ఎటూ సరిపోవడం లేదని మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీ సుకుంటే తమకు పని లభిస్తుందని లేదంటే తాము వేరే పని చూసుకోవాల్సి వస్తుందని తెలుపుతున్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
‘30 రోజుల క్రితం మార్కెట్లోకి వడ్లు తీసుకొచ్చిన ఇంకా నా సీరియల్ రాలేదు. మూడు నాలుగు రోజులుగా చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రాకల్లా మబ్బులు కమ్ముకుంటే నిద్ర కూడా పడ్తలేదు. వడ్లపై కప్పడానికి పట్టాలు కూడా లేవు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు వెంటనే వడ్లను కొనాలి.
అందె చంద్రయ్య,
రైతు నారాయణపురం






