2 July, 2026 | 1:19 AM

టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే లేడీస్!

02-07-2026 12:22 AM

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘టాక్సిక్’పై అంచనాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ హీరోగా నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఆగస్టు 26న విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ ‘లేడీస్ అండ్ లేడీస్’ పేరుతో ఓ పవర్ ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళా పాత్రలను పరిచయం చేస్తూ, కథలో వారి ప్రాధాన్యతను చూపించారు.