2 July, 2026 | 1:18 AM

నాగబంధం చాలా విలువైన సినిమా

02-07-2026 12:21 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

నిర్మాత సురేశ్‌బాబు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలా ఖరీదైన సినిమా ఇదని మేకర్స్ చెప్పారు. ఈ సమావేశంలో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. “నటుడిగా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశా” అన్నారు. హీరోయిన్ నభా నటేశ్ మాట్లాడుతూ.. “ఇంత అద్భుతమైన సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అభిషేక్ ఈ సినిమాను ఒక మ్యాజికల్ అనుభూతిలా తీర్చిదిద్దారు.

ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలి” అని చెప్పింది. దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. “మన సంస్కృతి, మన మూలాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం ఈ సినిమాలో ఉంటుంది” అని తెలిపారు. నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. “రూ.110 కోట్లకు పైగా పెట్టి తీసిన సినిమా ఇది.

అందుకే కొద్ది రోజులుగా కొంచెం టెన్షన్ పడ్డాను. ఫైనల్ మిక్స్ అయిన తర్వాత నాకున్న టెన్షన్ అంతా పోయింది. సినిమా ట్రెమండస్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అన్నారు. నిర్మాత నిశిత మాట్లాడుతూ.. “నిర్మాతలుగా ఈ సినిమా మీద మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది” అని చెప్పారు.