కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాన్ని కొనసాగించాల్సిందే
తులం బంగారం ఇవ్వాల్సిందే
మాజీ MLA మెచ్చా
అశ్వరావుపేట, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం అశ్వారావుపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. డిమాండ్లతో కూడిన మెమొరాండంని తహశీల్దార్ కి అందజేశారు.
ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన వెంటేనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన .కెసిఆర్ గారు 2014 అక్టోబర్ 02న కళ్యాణ లక్ష్మీ - షాది ముబారక్ పథకాన్ని ప్రారంభించారని, ప్రారంభంలో 51వేలుగా ఉన్న ఆర్థిక సహాయం తర్వాత 1,00,116కు పెంచారని. ప్రభుత్వమే ఒక కుటుంబ సభ్యుడిగా భాగస్వామిగా నిలబడిందని. సుమారు 13లక్షల మంది ఆడబిడ్డలకు కెసిఆర్ మేనమామలా సహాయాన్ని అందించారన్నారు.
ఈ పథకానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు సైతం లభించిందని.2023 ఎన్నికల సమయంలో కెసిఆర్ కేవలం లక్ష మాత్రమే ఇస్తున్నారు కాంగ్రెస్ గెలిచిన రోజు నుంచి లక్షతో పాటి తులం బంగారం ఇస్తానని ఆడబిడ్డలను నమ్మబలికి నేడు అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయకపోగా..ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిందని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జూపల్లి రమణారావు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి,యుఎస్ ప్రకాశ్ రావు,సంక ప్రసాద్,సర్పంచ్ నాగమణి తదితరులు ఉన్నారు.






