05-02-2026 12:00:00 AM
సుల్తానాబాద్ ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గల గేటుకు బిల్లులు చెల్లించడం లేదని జెసిబి యజమాని బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల గేటుకు తాళం వేశారు. ఈ సం దర్భంగా జెసిబి యజమాని రామ్మూర్తి మా ట్లాడుతూ గత కొంతకాలం క్రితం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో రోడ్డు వెడల్పు లో భాగంగా జెసిబి తో చేపట్టిన పనుల కు సంబంధించిన డబ్బులను అధికారులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప లుమార్లు పనులు చేసిన డబ్బుల విషయం అధికారులు అడిగిన రేపు మాపు అంటూ కా లయాపన చేస్తున్నారని ఆరోపించారు. జె సిబి కిస్తీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడా ల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ బ్బుల కోసం ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీదికి వచ్చి గొడవ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయమై సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ ను మీడియా వివరణ కోరగా మున్సిపల్ ఎన్నికల తర్వాత డబ్బులు చెల్లిస్తామని చెప్పడం జరిగిందన్నారు. చెప్పిన వి నకుండా గేటుకు తాళం వేయడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ రమేష్ తెలిపారు.