18 June, 2026 | 3:40 AM

ఫైనల్లో భారత్ ఏ

18-06-2026 02:24 AM

సమిష్టిగా రాణించిన కుర్రాళ్లు

ఆఫ్గన్‌పై భారీ విజయం

దంబుల్లా, జూన్ 17: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన భారత్ ఏ జట్టు కీలక మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. 102 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్ యువ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన 50 ఓవర్లలో 9 వికెట్లకు 319 పరుగులు చేసింది.

ప్రియాన్ష్ ఆర్య, కుమార్ కుశాగ్రా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీల తో రాణించారు. తర్వాత ఛేజింగ్‌లో ఆఫ్గనిస్థాన్ ఏ జట్టు చేతులెత్తేసింది. భారత ఏ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. నిశాంత్ సింధు 4 వికెట్లతో ఆఫ్గన్ ఏ జట్టు పతనాన్ని శాసించా డు. నిశాంత్ కేవలం 31 పరుగులు ఇచ్చి 4 వికె ట్లు తీసుకున్నాడు. ఆఫ్గనిస్థాన్ ఏ జట్టు 36.5 ఓవర్లలో 218 రన్స్ కు ఆలౌటైంది. కాగా 4 మ్యాచ్ లలో 2 గెలిచిన భారత్ మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఫలితంగా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.