30 May, 2026 | 2:21 AM

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

30-05-2026 01:26 AM
  1. బోరులో మోటారు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సరఫరా
  2. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  3. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 29(విజయ క్రాంతి) : శుక్రవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జూన్ 2  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు సం యుక్తంగా పనిచేయాల్సిందిగా సూచించా రు.

ప్రోటోకాల్ (నిర్వహణ నియమాలు)ను అనుసరిస్తూ ప్రముఖులు, మీడియా, తదితర సీటింగ్ గ్యాలరీలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్  కార్యాలయ ఏఓ యూనస్, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.