22 March, 2026 | 2:41 AM

భీమేశ్వర స్వామివారి సేవలో ఐజీపీ

22-03-2026 01:11 AM

వేములవాడ, మార్చి 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవా డలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామివారిని మల్టీ జోన్1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐజీపీకి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భం గా ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసు అధికారులతో  మాట్లాడుతూ, దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదన పు ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ, సిరిసిల్ల డీఎస్పీలు శ్రీనివాస్, నాగేంద్రచారి పాల్గొన్నారు.