16 March, 2026 | 10:57 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

16-03-2026 12:00 AM

చేగుంట, మార్చి 15 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింసోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందుఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం లోని వడియారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నదీమ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టినలముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి, ఉపవాస దీక్ష విడిపించారు.

ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని , రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు, అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సమానమని, సమాజంలో సోదర భావంతో కలిగి ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేం వెంగలరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, బల్ రెడ్డి,మొహమ్మద్ నదీమ్ హాసేన అలీ, వాసీం, అర్భాజ్, తంసియిన్, ఎజాజ్,మోహన్ నాయక్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,వార్డ్ మెంబెర్స్ సినియర్ నాయకులు పాల్గొన్నారు.