ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాసం
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సికింద్రాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ గౌసుద్దిన్, ముఖ్య అతిథిలుగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ముస్లిం సోదరుల తో కలసి నమాజు కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైనదని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, మస్జీద్ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో విందులో పాల్గొన్నారు.




