పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి
కల్వకుర్తి, మార్చి 16:పెంచిన వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు మాట్లాడు తూ యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, గ్యాస్ సిలిండర్లు కూడా సులభంగా దొరకడం లేదని అన్నారు.
యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను అధికంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ధరలను అదుపులోకి తీసుకురావాలని, యుద్ధ పరిస్థితులను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ అనితకు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు దార దాసు, సిపిఐ మండల నాయకులు నేరటి రాజు, వడ్డేమాన్ యేసు, శివుడు, వానరాశి శివ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




