అడవి పంది మాంసం స్వాధీనం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వరిపేట, ముత్యంపల్లి గ్రామంలోని ఫారెస్టు అధికారులు వేట మాంసం పట్టుకున్నారు. వివరాలిలున్నాయి. గుండేటి శ్రీధర్, దుర్గం శంకర్ ఇంట్లో సోదా చేయగా వేట మాంసం లభ్యమయింది. సదరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని విచారించగా. మందమర్రి కి చెందిన కందిలి సంజీవ్, కందిలి అనిల్ అనే వ్యక్తులు నుంచి ఈ వేట మాంసాని కొనుగోలు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
వేటమాంసాన్ని అమ్మిన వ్యక్తులను పట్టుకొని విచారించారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తి శివారులో అడవి పందిని చంపి, ఇట్టి మాంసాన్ని దుప్పి మాంసమని అమ్మినట్టు తెలిపారు. అడవిపందిని చంపిన ప్రదేశములో అడవిపంది తోలు, కాళ్ళు కొంత మాంసం అటవీశాఖ అధికారులు స్వాదీనం చేసుకొని నిందితులను విచారణ నిమిత్తం బెల్లంపల్లి రేంజ్ కార్యాలయానికి తరలించారు. వేట మాంసం తనిఖీ లో డీ ఆర్వో లు డి రాంబాబు, ఎం.లావణ్య, జే సత్యనారాయణ, ఎఫ్ ఎస్ వో సిహెచ్ యుగంధర్, ఎఫ్ బి వో లు బి. రాజేష్, సీ హెచ్ శ్రీధర్ పాల్గొన్నారు.






