9 August, 2026 | 2:27 AM

హైకోర్టు స్టే ఆర్డర్‌ను అమలు చేయాలి

09-08-2026 12:18 AM

యాదాద్రి పరిరక్షణ కమిటీ

యాదగిరిగుట్ట, ఆగస్టు 8 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన నిర్వహిస్తున్న వర్తక సంఘం వ్యాపారాలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.శనివారం యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ఏఈఓ శ్రవణ్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం పేరుతో కొనసాగుతున్న దుకాణాలను హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను నెంబర్ డబ్ల్యు పీ నెం.24140/2026ను తక్షణమే అమలు చేయాలన్నారు.

హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో వర్తక సంఘం పేరుతో కొనసాగుతున్న దుకాణాల్లో వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి, న్యాయస్థాన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా అధికారులు చూడాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బుగ్గ ఆంజనేయులు, కర్రె ప్రవీణ్, కాటబత్తిని ఆంజనేయులు, బండి అనిల్, పల్లపు బాలయ్య, దండ బోయిన వీరేష్ , మాటూరి బాలయ్య తదితరులున్నారు.