వైద్యం పేరిట వందల కోట్ల ఖర్చు!
- సింగరేణిలో 9 ఏళ్లలో కార్పొరేట్ వైద్యానికి రూ.436.99 కోట్లు
- మెరుగైన వైద్యం పేరిట నిధుల మళ్లింపు
- సంస్థకు ఆర్థిక నష్టం కలిగించింది ఎవరు?
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం ద్వారా కొత్తగూడెంకు చెందిన బోడికల ప్రేమ్ ద యాళ్ పొందిన సమాచారం ప్రకారం సింగరేణిలో 9 ఏళ్లలో రూ.436.99 కోట్లకు పైగా వైద్యానికి అయిన ఖర్చు వెలుగులోకి వచ్చిం ది. గుండె, క్యాన్సర్, ఆర్థో, ఊపిరితిత్తులు, న్యూరో ఫిజిషియన్, మెడికల్ సర్జికల్ గ్యా స్ట్రో, మూత్రపిండాలు, న్యూరో సర్జన్, సాధారణ వైద్యం, యూరాలజిస్ట్, సర్జికల్ ఆంకా లజిస్ట్, జనరల్ సర్జన్ తో పాటు మొత్తం 27 రకాల వైద్యానికి గాను 98,587 మందికి వైద్యం అందించినట్టుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. సాధారణంగా సింగరేణి సంస్థలో వైద్య పరీక్షలతో పాటు వైద్యం పలు రకాల శాస్త్ర చికిత్సలు చేస్తారు.
అయినప్పటికీ గత కొన్నేళ్లుగా కార్మికులను వారి కు టుంబ సభ్యులను మెరుగైన వైద్యం పేరిట వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ పేరిట కోట్ల రూపాయలు మళ్లించారు. ఇం దులో భాగంగా వైద్యానికి గాను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్న వారిని తరలించడానికి అంబులెన్స్ తో పాటు రోగిని పర్యవేక్షించడానికి నర్స్ లేదా వార్డ్ అసిస్టెంట్‌ని పంపిస్తారు. మెరుగైన వై ద్యమే కాకుండా సాధారణ వైద్యానికి సై తం అనేక మంది కార్మికులను సైతం రిఫర్ చేస్తు ంటారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాక వై ద్య పరీక్షలు నిర్వహించి వైద్యం చేసి సదు రు వైద్య ఖర్చుల నివేదికలు సింగరేణి సం స్థకు పంపుతారు. ఆ ఖర్చును సంస్థ చెల్లిస్తుంది.
ఉద్యోగులను అన్‌ఫిట్ చేశారా?
వందల కోట్లు ఖర్చు చేసే సంస్థ దీర్ఘకాలిక వ్యాధులతో వైద్యం వైద్యం పొందుతున్న ఉద్యోగి, ఉద్యోగానికి అర్హుడా, అనర్హుడా అనేది ప్రకటించారా? ప్రకటించి వైద్యం అం దించారా? అనే కోణంలో విచారణ జరిపించాలి. అదే విధంగా దీర్ఘకాలిక రోగాలతో వై ద్యం పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించారా? అనే కోణంలో విచారణ జరిపించాలని కార్మికులు కోరుతున్నారు.






