కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ.!
10-07-2026 02:25 PM
- వట్టిపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఒకే రోజు 9 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.






