10 July, 2026 | 3:29 PM

మేడిగడ్డను బొందలగడ్డ చేసిందే బీఆర్ఎస్ నేతలు

10-07-2026 02:31 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్(MP Chamala Kiran Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ చామల కిరణ్ మాట్లాడుతూ... మేడిగడ్డను బొందలగడ్డ చేసిందే బీఆర్ఎస్ నేతలేనని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram Project) రూ. 1.27 లక్షల కోట్లో ఖర్చు చేశారని చామల పేర్కొన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) ద్వారా 2019 నుంచి 2023 వరకు 150 టీఎంసీలు ఎత్తిపోశారని వివరించారు. ఎత్తిపోసిన నీళ్లలో మళ్లీ 60 టీఎంసీలు కిందకు వదిలేశారని ఆరోపించారు.

కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల్లాగ.. కాంగ్రెస్ ప్రాజెక్టులు మూడేళ్లకే కూలలేదు

బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల్లాగ.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు మూడేళ్లకే కూలలేదని చామల విమర్శించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కట్టిన కాళేశ్వరం వల్లే రాష్ట్రానికి నీళ్లు వస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కట్టిన ఇళ్లు కూలిపోయాక.. కుస్తీలు కడుతున్నట్లుగా కాళేశ్వరం ఉందన్నారు. రూ. లక్ష కోట్లు అప్పు చేసిన కట్టిన ప్రాజెక్టు కూలిపోతే ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు. అందరినీ తొక్కేసి సొంతంగా ఎదగాలనే లక్ష్యాన్ని కేటీఆర్ పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే చెల్లిని వెళ్లగొట్టారు.. ఇక బావను పంపించాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.