10 July, 2026 | 3:29 PM

కరీంనగర్‌ ఆదర్శ నగరంగా ఎదగాలి

10-07-2026 02:35 PM

ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ప్రశంసలు

ముకరంపుర, జూలై 10(విజయ క్రాంతి): వ్యక్తిగత పర్యటన నిమిత్తం శుక్రవారం కరీంనగర్ నగరానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జల శక్తి శాఖ క్యాబినెట్ మంత్రి  స్వతంత్ర దేవ్ సింగ్ ని నగర మేయర్  కొలగాని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు  మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతించారు.ఈ సందర్భంగా మంత్రి , మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, స్థానిక సంస్థల పాత్ర, మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి నిర్వహణ, స్మార్ట్ సిటీ భావన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పట్టణాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల బాధ్యత వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అనంతరం మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయం. దేశంలోని అభివృద్ధి చెందుతున్న పోటీ నగరాల సరసన నిలిచే సామర్థ్యం కరీంనగర్‌కు ఉంది. నగర అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు చూపుతున్న నిబద్ధత అభినందనీయం. భవిష్యత్తులో కరీంనగర్ మరింత ఆదర్శ నగరంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.