10 July, 2026 | 3:30 PM

డా. శ్రీవాణికి ఘన సన్మానం

10-07-2026 02:27 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ హెచ్‌ఓడీ, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీవాణి జాతీయ స్థాయిలో ఇండియన్ ఎకనామిక్స్ ఈసీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు, తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు పీహెచ్‌డీ స్కాలర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విశేష సేవలు అందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్న డాక్టర్ శ్రీవాణి నియామకం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, శాతవాహన యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్న డాక్టర్ శ్రీవాణి కి యూనివర్సిటీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు.