10 July, 2026 | 3:49 PM

ఇంటింటికి మొక్కలు పంచి పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు

10-07-2026 02:45 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ ఉపసర్పంచ్ విష్ణు దిగులే ఆధ్వర్యంలో ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగించారు. తీసుకు వెళ్లిన మొక్కలను నాటి బ్రతికించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ కోసం 100 మొక్కలను నాటడం జరిగింది కార్యక్రమంలో ముందే ఈశ్వర్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు