21 April, 2026 | 3:11 AM

మహానీయుడు బసవేశ్వరుడు

21-04-2026 01:47 AM

జయంతి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు

ఆదిలాబాద్/నిర్మల్/బోథ్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): సమాజంలో కుల, వర్గ, వర్ణ వివక్షణను రూపుమాపడం కోసం వందల ఎండ్ల క్రితమే కృషి చేసిన మహానీయుడు మహాత్మా బసవేశ్వరుడని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో అధికారికంగా నిర్వహించిన బసవేశ్వర మహారాజ్ 893వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మాజీ మంత్రి జోగు రామన్న, అదనపు కలెక్టర్ చిత్రులతో కలిసి ఆమహనీయుని విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కుల వ్యవ స్థలు ఉండవద్దని అందరు సమానమేనన్న సందేశాన్ని మహాత్మ బసవేశ్వరుడు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫర్ అధికారిణి సోనియా, జంగమ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల  సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త

మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో గొప్ప సంఘ సంస్కర్తగా పేరు పొందారని ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం మండలం లోని కౌట(బి ) గ్రామంలో లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి, వెండి సోమేశ్వర్ ఉపసర్పంచ్ రమణారెడ్డి, నాయకులు రాంరెడ్డి, సాగర్ రెడ్డి, కొంకటి గంగాధర్, వార్డు సభ్యులు గడ్డల శంకర్, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.

నేటి తరానికి ఆదర్శం బసవేశ్వరుడు

దేశంలో కుల, వర్ణ, జాతికి వ్యతిరేకంగా సంస్కరణలు చేపట్టిన మహాత్మా బసవేశ్వరుడి మార్గం నేటి తరానికి ఆదర్శనీయమని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పూలమాలవేసి నివాళులు అర్పించారు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షు లు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, బీజేపీ నాయకులు వీరేష్, సాగర్, ఆనంద్ తో పాటు గ్రామాల సర్పంచ్‌లు, బీజేపీ పట్టణ మండల నాయకులుపాల్గొన్నారు. అలాగే నిర్మజిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతిని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, పరిపాలన అధికారి ఖాళీ, వీరశైవ లింగాయత్ మహారాజ్ సరస్వతి ఆనంద్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, గౌరవ అధ్యక్షులు గంగాధర పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు దత్తు, మాజీ జిల్లా అధ్యక్షులు కామన పటేల్, యూత్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్, జంగం సంఘం అధ్యక్షు డు వీరయ్య పాల్గొన్నారు.