26 February, 2026 | 7:20 AM

వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణం

26-02-2026 12:00 AM

తరలివచ్చిన భక్తజనం

తలకొండపల్లి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మండల పరిధిలోని చుక్కాపూర్ గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీ కాలికిదోనా వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

స్థానిక సర్పంచ్ వీరేశలింగంతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉత్సాహాలకు చుక్కాపూర్, పాతకోట తండా, పడమటి తండా, ఖానాపూర్, మంగళపల్లి, మరియు చింతలపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా  వేణుగోపాల స్వామి నామస్మరణతో చుక్కాపూర్ పురవీధులు మారుమోగాయి.