సహకార సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదు
- నామినేటెడ్ విధానం పై నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
- ప్రజాస్వామ్యయూతంగా సహకార ఎన్నికలు నిర్వహించాలి
- సహకార సంఘాల జిల్లా ఫోరం డిమాండ్
జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ) : తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్),జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు (డిసిసిబి ) ఎన్నికలు నిర్వహించడానికి బదులుగా, నామినేటెడ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే, ఈ సంఘాలకు కూడా ప్రభుత్వం నేరుగా సభ్యులను నియమించాలని భావిస్తోందని.ఈ నిర్ణయంపై సహకార సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార వ్యవస్థలో నామినేటెడ్ పద్ధతిని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా సహకార సంఘాల ఫోరం తీవ్రంగా స్పందించింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విరుద్ధమని, ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకనే ప్రభుత్వం అడ్డదారిలో నామినేటెడ్ విధానాన్ని తెస్తోందని నాయకులు విమర్శిస్తున్నారు. సహకార సంఘ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని, సంఘంలోని సభ్యులు ఎన్నుకోవాలి కానీ నామినేటెడ్ రూపంలో సంఘ సభ్యులు ఎన్నుకోబడకూడదని గుర్తు చేస్తూ, నామినేటెడ్ గా ఎన్నుకున్న వారు జవాబుదారుతనంగా ఎవరికి ఉంటారని స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వానికి వసూళ్ల పైన సెటిల్మెంట్ల పైన మాత్రమే చిత్తశుద్ధి ఉందని, సహకార వ్యవస్థ కాంగ్రెస్ కార్యకర్తల పదవుల పందెం కాదని, జిల్లాలో ఉన్న 52 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు.
అలాగే రైతులే ముఖ్యమని, సహకార రంగానికి రైతులే వెన్నుముక అని, రాజకీయ జోక్యం వల్ల ఈ వ్యవస్థ నిర్వీర్యమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తు సహకార వ్యవస్థ రైతుల చేత నిర్మించబడి ఉంటుంది దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వo కుట్రలు పన్నుతు, ఎన్నికల్లో గెలవేమోనని ప్రభుత్వం బయపడుతుందని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి సహకార సంఘ సభ్యులను నామినేటెడ్ చేస్తే..మోడీ అసెంబ్లీకి ఎమ్మెల్యేలను నామినేటెడ్ చేస్తా అంటాడని ప్రజాస్వామ్యాన్ని కూణీ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలపై ప్రభుత్వం కక్ష్య సాధింపు తగదని ఆక్షేపిస్తూ, సహకార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వారు ఆరోపిస్తున్నారు. మొత్తంగా, సహకార సంఘాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, నామినేటెడ్ కమిటీల ఏర్పాటును అడ్డుకుంటామని సహకార సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపో రాటం చేస్తామని, అలాగే రైతులను సమీకరించి ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తాజా మాజీ అధ్యక్షులు అయిల్నేని సాగర్ రావు,రాజా సుమన్ రావ్, మహిపాల్ రెడ్డి, వెంకట మాధవ్, మధు సుధన్ రావ్,తదితరులు పాల్గొన్నారు.






