23 April, 2026 | 4:42 AM

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడమే ప్రభుత్వ లక్ష్యం

23-04-2026 01:29 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి: ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెండు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన దాన్యం దళారుల పాలు కావద్దని ఈ కొనుగోలు కేంద్రాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎంపీడీవో జయశీల, ఏవో ప్రణీత, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, సర్పంచులు నల్ల మోహన్, ఉయ్యాల శ్రీనివాస్, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ బాలగోని వెంకటేష్ , కాంగ్రెస్ నాయకులు స్తంబ లక్ష్మీరాజం, సురేందర్, తదితరులు ఉన్నారు.