నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సదస్సుకు తరలిరండి
ఎన్సిసి క్రిస్టియన్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు పాల్ కరుణాకర్
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలంలో జరుప తలపెట్టిన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సదస్సుకు క్రైస్తవ రాజకీయ మేధావులు, దళిత క్రైస్తవులు, వేలాదిగా తరలివచ్చి అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఎన్సిసి ఎస్సీ క్రైస్తవ విభాగం జిల్లా అధ్యక్షులు పాల్ కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కడం హరిత రిసార్ట్స్లో లో ఎన్సీసి రాష్ట్ర, జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 9న కడం కొఃడుకూరులోని ఎస్ కే ఫంక్షన్ హాల్ లో జరిగే అవగాహన సదస్సులో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని ,దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, క్రైస్తవులపై, చర్చిలపై దాడులు, క్రైస్తవ ప్రయోజనాలు, న్యాయ సలహాలు ,వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు .ఈ సందర్భంగా ఎన్సిసి నిర్మల్ జిల్లా అధ్యక్షులు బి ప్రభాకర్, మేధో సంపత్తి హక్కుల విభాగం నిర్మల్ జిల్లా నాయకులు మధుకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, రాజకీయ విభాగం నిర్మల్ జిల్లా నాయకులు సత్యనారాయణ లను సత్కరించారు. కార్యక్రమంలో బీఎస్పి ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు ఎం జోసఫ్ గంగారం ,తదితరులు ఉన్నారు.






