20 August, 2026 | 1:49 PM

గుండెపోటుతో హోటల్ యజమాని మృతి

20-08-2026 12:46 PM

కొడిమ్యాల,ఆగస్టు 20 (విజయక్రాంతి) : గుండెపోటుతో హోటల్ యజమాని గోనె శ్రీనివాస్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కొన్ని సంవత్సరాల నుండి రోజు హోటల్ నడుపుతూ జీవనం గడుపుతూ ఉండే శ్రీనివాస్ కు గురువారం అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఇబ్బంది పడుతుండగా,గమనించిన తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించి మృతి  చెందినట్లు బంధువులు తెలిపారు.మృతునికి భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల బంధువులు, మిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.