28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

పేదలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుంది

16-03-2026 12:00 AM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన జుక్కల్  ఎమ్మెల్యే

నిజాంసాగర్, మార్చి 15( విజయ క్రాం తి): ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి  గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం  ప్రారంభించారు. లబ్ధిదారుల ప్రత్యేక ఆహ్వా నం మేరకు ఎమ్మెల్యే గృహప్రవేశ కార్య క్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. త్వరలోనే పూర్తిగా గృహప్రవేశాలు జరిపిస్తామన్నారు. 

అనంతరం జక్కాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, అచ్చంపేట సర్పంచ్  సంకు లక్ష్మయ్య, నాయకులు ప్రజా పండరి, మెంగారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.