28 June, 2026 | 12:51 PM

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

28-06-2026 12:01 PM

మునుగోడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్‌వి ప్రధాన కార్యదర్శి బంగారు రవి, దోటి కరుణాకర్, పందుల సురేష్‌లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

బీఆర్ఎస్ నాయకులు ఈ అరెస్టులను అక్రమమని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న చర్యగా ఖండించారు. శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయకుండా అడ్డుకోవడానికే ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోందని విమర్శించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.