11 June, 2026 | 3:19 AM

రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

11-06-2026 12:03 AM

ఎమ్మెల్యే కోరం 

టేకులపల్లి, (విజయక్రాంతి): వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని  ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి  సంఘం  ఆధ్వర్యంలో  సబ్సిడీపై జీలుగు, జనుములు విత్తనాలను రైతులకు బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

రైతు కుటుంబాల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బాట అని పేర్కొంటూ, రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ వంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు, ఏఓ అన్నపూర్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, పీఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.