2 July, 2026 | 1:12 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

కళాశాలల బంద్ విజయవంతం

02-07-2026 12:52 PM

బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): పాత పద్ధతిలోనే ఫీజు రీయాంబర్స్మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కాలేజీల బంద్(College bandh successful) విజయవంతంగా ముగిసింది. ప్రయివేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయని,ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించుడం జరిగింది. ఫీజు రీయాంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నటువంటి జీఓ 9 ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే అమలు చేయాలని అన్నారు,లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరంతరం చేపడతామని బీసీ విద్యార్థి  సంగం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్,బిసి ప్రధాన కార్యదర్శి దయాకర్, ప్రవీణ్,సంతోష్,వినీత్, ప్రభు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..