25 April, 2026 | 1:49 AM

నాణ్యమైన వైద్యమందించడమే ప్రభుత్వ ధ్యేయం

25-04-2026 12:08 AM
  1. తెలంగాణ వైద్య విధాన పరిషత్, సెకండరీ హెల్త్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
  2. గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

గజ్వేల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ వైద్య విధాన పరిషత్, సెకండరీ హెల్త్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా  తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణము, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ప్రసూతి, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బయో మెడికల్ వేస్టేజ్, నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చికిత్స పొందే వరకు ప్రతి దశలో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, వ్యర్ధ పదార్థాలను వేర్వేరు డస్ట్ బిన్‌లలో వేసి నిబంధనల మేరకు తరలించాలన్నారు.

పజలందరూ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అజయ్‌కుమార్ వెంట గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రాజేష్ ఆర్.ఎం.వో, డాక్టర్ ప్రణీతి ఆర్.ఎం.వో సీనియర్ అసిస్టెంట్ సతీష్, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఫార్మసీ ఆఫీసర్స్ విమల, ఎఫ్సిబా, శ్రీనివాసచారి, మోహన్ బండారి, సిబ్బంది పాల్గొన్నారు.