నమ్మకమైన విత్తనం అందించడమే లక్ష్యం
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్ది
మంచిర్యాల, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, కు మ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,
ఈ పరిస్థితులలో వారిని నాణ్యమై న విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉందని,ప్రతి సంవత్సరం నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరి సాగు మాత్ర మే కాకుండా, రైతులు లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, కం ది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు.
విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై విత్తన ఉత్పత్తి చేపడుతుందని, కఠినమైన ప్రమాణ పరీక్షల తర్వాత వాటిని ధృవీకరించి రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలలో విత్తనాల కొరత లేదని, సన్న రకాలు బిపిటి 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638 అందుబా టులో ఉన్నాయని, దొడ్డు రకాలు కెఎన్‌ఎం 118, ఎమ్టియు 1010 కూడా రైతులకు అం దించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ప్ర భుత్వం సూచించిన ఈ రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని, విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను ప్రతి విత్తన డీలర్ విక్రయించాలని, పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను సకాలంలో అందిస్తామని తెలిపారు. పంట సాగు లు శాస్త్రీయ, సేంద్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు దిగుబడి చేయవ చ్చని తెలిపారు. సాధారణ పంటలే కాకుం డా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల సాగు పై రైతులు దృష్టి సారించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పంట సా గులో వివిధ రకాలైన పంటలు సాగు చేసే లా రైతులకు అవగాహన కల్పించాలని, పంట సాగులో అవసరమైన మెలకువలు అం దించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ (టెక్నికల్), సహకార అధికారులు, ఏడీఏలు, ఎంఏఓలు, ఎఫ్పీఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






