8 May, 2026 | 2:23 AM

జీవో నంబర్7ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి

08-05-2026 01:24 AM

సికింద్రాబాద్, మే7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 7ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డి మాండ్ చేశారు.

గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జీవో ప్రతులను చింపి నిరసన తెలిపారు. జీవీ ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ, ఓయూ విద్యార్థి నాయకులు ప్రభాకర్, అనిల్, సాయి కిరణ్, అనిల్, కుమార్, సంజయ్,శివ, అనిల్ నాయక్, నరేష్, సురేష్, అభి  పాల్గొన్నారు.