15 June, 2026 | 2:35 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యం

09-01-2026 12:00 AM

కలెక్టర్ హరిచందన దాసరి

సికింద్రాబాద్, జనవరి 8 (విజయ్‌క్రాంతి): హైదరాబాద్ జిల్లాను క్రీడల్లో ముందు వరుసలో ఉంచాలని ,అందుకు క్రీడాకారులు నైపుణ్యాలకు మరింత  పదును పెట్టా లని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం జింఖానా గ్రౌండ్ లోని సీఎం కప్  రెండో ఎడి షన్‌ను అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా నుండి  అన్ని క్రీడలలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అంతకు ముందు  కలెక్టర్ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ జిల్లా క్రీడా కార్యక్ర మాల్లో భాగంగా అనేక క్రీడలలో పాల్గొనడంలో జిల్లా రాష్ట్రం లో  ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా సిద్ధమై ఉన్న యువ క్రీడాకారులను చూడ టం ఎంతో ఆనందంగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయి రాం, జిల్లా యువజన క్రీడల అధికారి సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వినీల, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, పిఈటిలు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.