పేదలకు వైద్య సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం
చిట్యాల, ఏప్రిల్ 23: తెల్ల రేషన్ కార్డు కలిగి అర్హులైన పేదలు వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహాయం చేయడానికి కట్టుబడి ఉంది అని పెద్ద కాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం పేర్కొన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనసభ్యుడు, వేముల వీరేశం సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) పథకం కింద మంజూరైన చెక్కులను ఆ గ్రామ సర్పంచ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతపల్లి లక్ష్మమ్మకు రూ. 28,000, మోర అనితకు రూ. 24,400 విలువైన చెక్కులను గ్రామ సర్పంచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి అర్హులైన పేదలు వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహాయం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ల నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జెల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






