10 March, 2026 | 8:55 PM

సర్కార్ కక్కుర్తి!

09-03-2026 02:23 AM

డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యూమరేటర్లకు చెల్లింపుల్లో కోత

  1. పంటల సాగు లెక్కింపు సర్వే చెల్లింపుల్లో వ్యత్యాసం
  2. ఒక్కో ఫొటోకు రూ. 10చొప్పున చెల్లిస్తున్న కేంద్రం 
  3. రూ. 3 కోత పెట్టి  రూ. 7ఇస్తున్న తెలంగాణ సర్కార్
  4. యాప్ నిర్వహణ ఖర్చు కోసమేనంటున్న వ్యవసాయ శాఖ
  5. రూ.2 కోట్లకు పైగా తేడాపై అనుమానాలు
  6. పక్క రాష్ట్రమైన ఏపీలో రూ.10 చొప్పున చెల్లింపు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : పంటసాగు లెక్కలు పక్కగా లెక్కించేందుకు నియమించుకున్న ఎన్యూమరేటర్ల చెల్లింపుల్లో సర్కార్ కక్కుర్తి పడుతోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం కేటాయించిన సొమ్మును సర్కార్ కాజేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంటసాగు లెక్కలు పక్కగా లెక్కించేందుకు దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాప్ (డీసీఎస్) సర్వే చేపట్టింది. ఈ పంటసాగు లెక్కలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే  ఎన్యూమరేటర్లను నియమించింది. ఇందుకయ్యే ఖర్చు లో అత్యధిక మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది.

డీసీఎస్ కోసం తాత్కాలిక పద్ధతిలో 9,500 మంది ఎన్యూమరేటర్లను వ్యవసాయ శాఖ నియమించుకొన్నది. ఒక ఎన్యూమరేటర్ ఒక రెవెన్యూ గ్రామంలోని పంటసాగు వివరాలను సర్కార్  ఇచ్చిన యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక సర్వే నెంబర్ లేదా బై నెంబర్‌లో భూమిలో సాగు చేసిన పంటలకు సంబంధించి ఫొటోలు తీసీ నమోదు చేస్తే.. ఎన్యుమరేటర్‌కు ఒక ఫొటో కు కేంద్ర ప్రభుత్వం రూ. 10 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే  రాష్ట్రంలో ఫీల్డ్‌సర్వే చేసి యాప్‌లో అప్‌లోడు చేస్తే.. ఒక ఫొటోకు రూ 7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా, తెలంగా ణలో రూ.3 తక్కువగా చెల్లిం చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదే  పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేవ్‌లో మా త్రం రూ.10 చెల్లిస్తున్నారు. దీంతో ఒకే పథ కం అమలుకు రెండు రాష్ట్రాల్లో చెల్లింపుల్లో వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. అంతకు ముందు ఏఈవోలు చేపట్టిన పంటల సాగు సర్వేకు గాను రాష్ట్ర ప్రభుత్వం  ఒక ఫొటోకు రూ. 6మాత్రమే చెల్లించిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. స ర్వే కోసం వినియోగించే యాప్ నిర్వహణతో పాటు సర్వర్ ఖర్చుల కోసమే రూ.3 తక్కువగా చెల్లిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి.

అయితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నా.. యాప్, సర్వర్ ఖర్చులు తీసుకోవడం లేదని, తెలంగాణలో రూ. 3 తగ్గిం చడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాప్ ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుండగా, మరి కేంద్రం యాప్‌ను వినియోగిస్తూ నిర్వహణ కోసమంటూ తమకు రూ.2 కోట్ల మేర  కోత విధించడం సరికాదని ఎన్యుమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మిగతా రూ.2కోట్లు ఎవరి ఖాతాలోకి?  

కాగా,  రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. పంటల సాగు లెక్కలు పక్కగా తెలుసుకునేందుకు కాంట్రా క్టు పద్ధతిలో తీసుకున్న ఎన్యుమరేటర్లకు వ్యవసాయ శాఖ శిక్షణ కూడా ఇచ్చింది. ఈ ఎన్యుమరేటర్లు పలుచోట్ల సర్వే పనులు మొదలు పెట్టారు. వీరికి ఒక్క సర్వే నంబర్లో ఒక రైతుకు సంబంధించిన పంట వివరాలు ఫొటోతోపాటు నమోదు చేసినందుకు రూ.7 చెల్లిస్తున్నది. మొత్తం సర్వే చేయడానికి డీసీఎస్ కింద ఎన్యుమరేటర్లకు సుమారు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం చెప్పినట్టుగా, ఏపీలో చెల్లిస్తున్నట్టుగా ఒక సర్వేకు రూ.10 చెల్లిస్తే రూ.7 కోట్లు అవుతుంది.

తెలంగాణలో రూ.2 తగ్గించడం వల్ల ఎన్యుమరేటర్లకు చెల్లిం పులో రూ.2 కోట్ల తేడా వస్తున్నది. దీంతో మిగతా రూ.2 కోట్లు ఏమవుతున్నాయి..? ఎవరికి పోతున్నాయి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కాకుండా ఏఈవోలు, ఎన్యుమరేటర్లకు డీసీఎస్ తలనొ ప్పిగా మారిందని చెబుతు న్నారు. ముందుగా సర్వే పూర్తికి వ్యవసాయ శాఖ 45 రోజుల గడువు ఇచ్చింది.

ఇప్పుడు ఈ నెల 15లోగా పంట లెక్కలు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ  అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. దీంతో ఏఈవోలు, ఎన్యుమరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు పెద్ద ఇబ్బందిగా మారింది. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో సగం కూడా పూర్తి కాలేదని సమాచారం. 


ఇవి కూడా చదవండి:

పసుపు పంటకు.. మార్కెట్ ఏది?

వనపర్తికి కేంద్రియ విద్యాలయం

ప్రమాదం అంచునలో లెవెల్ బ్రిడ్జి..