9 May, 2026 | 4:32 AM

చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం

09-05-2026 12:00 AM

శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి

వనపర్తి, మే 8 ( విజయక్రాంతి ) : మత్స్యకారులకు అన్ని రకాలుగా సహకారం అం దించి, వారికి అవసరమైన సౌకర్యాలను క ల్పించి, చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నా రు. శుక్రవారం నాగవరం శివారులోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార రైతులకు అనేక అం శాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనస భ్యులు మేఘారెడ్డి తో పాటు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ మత్స్యకారులకు అన్ని రకాలుగా సహకారం అందించి, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించి, చేపల ఉత్పత్తిలో రా ష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ ల క్ష్యం అని పేర్కొన్నారు. చేపల్లో అత్యధికంగా ప్రోటీన్ ఉండడం కారణంగా వైద్యులు చేప లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సి ఫారసు చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమం లో జిల్లాలో అందరికీ మంచి చేపలను అం దించేలా చర్యలు చేపడతామన్నా రు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మత్స్య కారులు చేపల విక్రయాలు చేసుకునేందుకు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏ మున్నా తమను సంప్రదించవచ్చని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సౌకర్యాలను మత్స్యకారులు వినియోగించుకొని మంచి దిగుబడి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, పెబ్బేరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవానంద్, సిఎస్సి ప్రతినిధి మాలిక్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాలోని మస్స్యకార సహకార సం ఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.