4 April, 2026 | 4:14 AM

పేదల సొంతింటి కలని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

04-04-2026 12:32 AM

సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్

దేవరకొండ, ఏప్రిల్ 3 : పేదల సొంతింటి కలని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ అన్నారు శుక్రవారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామం కొర్రతండా లో కొర్ర రేఖా రమేష్ నాయక్  ఇందిరమ్మ గృహము ప్రారంభించిన  గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఇల్లు లేని పేదవాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంగా పెట్టుకొని నేనవత్ బాలు నాయక్ ఎమ్మెల్యే సహకారంతో మైనంపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలూ నాయక్, మాజీ సర్పంచ్ పాండు నాయక్, వార్డు సభ్యులు లక్ష్మీ ప్రశాంత్, సునీత బద్దు, సంతోష వెంకట్, కిషన్ నాయక్, వడిత్య స్నేహ వినోద్, పులిజాల నాగరాజు. గ్రామ కాంగ్రెస్ పెద్దలు కొర్ర గణేష్ కొర్ర శ్రీను, జబ్బార్ లాల్, నరేష్, శ్రీకాంత్, రమేష్, నవీన్. చందు, లాల్య, బిచ్చు, మహేష్, మంగులాల్ తదితరులు పాల్గొన్నారు.